గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించగా.. వైకాపా ప్రభుత్వంలో అన్ని మతాలకు ప్రాధాన్యత ఉంటుందని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు చెప్పారు. తిరుమలలో బస్ టికెట్లను తెదేపా ప్రభుత్వమే ముద్రించిందని, ఇదే కాకుండా హజ్ యాత్ర సమయంలోనూ ఇలానే చేసిందని తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను చూపించారు. తెదేపా, భాజపాలు కలసి ప్రభుత్వంపై హిందు వ్యతిరేకి అనే ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. గోవుల మృతి వ్యవహారం ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదనీ, దానికి ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపారు.
ఇదీ చూడండి :'సందేహం లేదు...రాజధాని ముంపు ప్రాంతంలోనే ఉంది'