కక్షసాధింపు చర్యలో భాగంగానే ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందని తెదేపా గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ విమర్శించారు. అమరావతి ఉద్యమం చేపట్టి సంవత్సర కాలం పూర్తవుతున్నా... ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవటం దారుణమన్నారు. గుంటూరు జిల్లాలో గెలిచిన ప్రజాప్రతినిధులు అమరావతి రాజధానికి మద్దుతు ఇవ్వకపోవడం సిక్కుచేటు అని మండిపడ్డారు. ఎంపీ నందిగం సురేశ్ డబ్బులిచ్చి మరీ మూడు రాజధానుల ఉద్యమాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న అమరావతి రైతులపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి ఉద్యమం సంవత్సరం పూర్తైన సందర్భంగా ఈనెల 17న ఉద్ధండరాయుని పాలెంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఆ సభకు తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరవుతారని స్పష్టం చేశారు. అమరావతి పరిరక్షణ కోసం శనివారం గుంటూరు నగరంలో చేపట్టనున్న మహా పాదయాత్రను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదీచదవండి