ETV Bharat / state

TDP Mahashakti: "తెలుగుదేశం వల్లే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు" - మహాశక్తి

Mahashakti Awareness Program: మహాశక్తి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. టీడీపీ జాతీయ కార్యాలయం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు.. జెండా ఊపి మహాశక్తి ప్రచార రథాలను ప్రారంభించారు.

Mahashakti Awareness Program
Mahashakti Awareness Program
author img

By

Published : Jul 14, 2023, 5:40 PM IST

Mahashakti Awareness Program: గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్​ భవన్​లో మహాశక్తి అవగాహన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల్లోని మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. మేనిఫెస్టోలో మహిళల కోసం పొందుపర్చిన ప్రతి అంశాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసి చూపుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తోందని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పష్టం చేశారు. మహాశక్తి వీడియోను తెలుగు మహిళలు విడుదల చేశారు. మహిళలకు చంద్రబాబు ప్రకటించిన వరాలు వారి భవిష్యత్​కు బంగారు బాటలు వేయబోతున్నాయని.. వెల్లడించారు.

TDP Leader Anitha Fires on YSRCP: తెలుగుదేశం పార్టీ వల్లే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు లభించిందని వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్​ సతీమణి భారతీ రెడ్డి, సోదరి షర్మిలకు ఆస్తులు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ వల్లేనని ఉద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తే, జగన్మోహన్ రెడ్డి తన ఇంటి మనుషుల్ని కూడా వంచించాడని ఆక్షేపించారు. సంక్షేమానికి కాపీ రైట్ తెలుగుదేశం పార్టీ అని అనిత తేల్చిచెప్పారు. సైకో పాలనలో ఎంతోమంది మహిళలు దగా పడ్డారని మండిపడ్డారు. మహిళలకు ప్రకటించిన పథకాలతో 7 వేల గ్రామాల్లో ప్రచారం చేస్తామని, 20 లక్షల మంది మహిళలను కలుసుకునేలా రథయాత్ర జరుగుతుందని తెలిపారు.

Atchennaidu Fires on CM jagan: రాష్ట్రంలో మహిళలకు గుర్తింపు రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా జగన్ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి.. మాట మార్చాడని.. జగన్ బటన్ నొక్కినా డబ్బులు పడటం లేదని మండిపడ్డారు. జగన్ ఫేక్ ముఖ్యమంత్రి అని.. అబద్ధాల కోరని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. 50 రోజులపాటు మహాశక్తి పథకాలపై ప్రచారం చేస్తామని తెలిపారు. 160 సీట్లతో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని అచ్చెన్నాయుడు అన్నారు.

Mahashakthi Vehicles Launched: మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్​లో.."మహాశక్తి" చైతన్య రథయాత్ర వాహనాలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత ప్రారంభించారు. వాహనాలపై వేసిన పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని.. మహాశక్తి పథకం ప్రయోజనాలు వివరిస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. 50 రోజులు పాటు 175 నియోజకవర్గాల్లో 7 వేల గ్రామాల్లో 20 లక్షల మందిని క్షేత్రస్థాయిలో కలిసి మహాశక్తి పథకాల గురించి వివరిస్తామన్నారు. వాహనాల ద్వారా వివిధ వర్గాల మహిళలను కలిసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.