ఇవీ చదవండి..
తనిఖీల్లో మద్యం సీసాలు పట్టివేత - నరసరావు పేట
గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీల్లో 192 మద్యం సీసాలు దొరికాయి. ఈ రెండు ఘటనలకు సంబంధించి రెండు వాహనాలను, మద్యం సీసాలను, ఐదుగురు వ్యక్తులను పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
తనిఖీల్లో మద్యం సీసాలు పట్టివేత
గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీల్లో 192 మద్యం సీసాలు దొరికాయి. పట్టణంలోని మల్లమ్మ సెంటర్లో స్కార్పియో కారులో తరలిస్తున్న 141 క్వార్టర్ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తీసుకెళ్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. శివ సంజీవయ్య కాలనీలో ద్విచక్రవాహనంలో ఉంచిన 51 క్వార్టర్ బాటిళ్లు లభ్యమయ్యాయి. వాటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి రెండు వాహనాలను, మద్యం సీసాలను, ఐదుగురు వ్యక్తులను పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఎన్నికల వ్యయ పరిశీలకుడు మహంతి అక్కడకు చేరుకుని విచారణ చేశారు.
ఇవీ చదవండి..
sample description