ETV Bharat / state

'పల్నాడులోనే జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలి'

పల్నాడులోనే జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని.. పల్నాడు జిల్లా కేంద్రం సాధన సమితి అధ్యక్షుడు గాదె రామకృష్ణా రావు డిమాండ్ చేశారు. నరసరావుపేట పల్నాడులో ఎలా భాగం అవుతుందని ప్రశ్నించారు. పల్నాడు జిల్లా కేంద్రం సాధన కోసం పలు సంఘాలతో కలసి ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు.

Macharla People Demands for district headquarter in Palnadu Area
పల్నాడు జిల్లా కేంద్రం సాధన సమితి
author img

By

Published : Nov 18, 2020, 11:13 PM IST

అత్యంత వెనుకబడిన ప్రాంతమైన పల్నాడులోనే జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని.. పల్నాడు జిల్లా కేంద్రం సాధన సమితి అధ్యక్షుడు గాదె రామకృష్ణా రావు డిమాండ్ చేశారు. బుధవారం మాచర్లలో సామాజిక న్యాయ సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సభకు సమితి వ్యవస్థాపకుడు వేముల కొండలరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణా రావు మాట్లాడుతూ... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా పేరుతో గురజాలలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. నరసరావుపేట పల్నాడులో భాగమెలా అవుతుందని ప్రశ్నించారు. పల్నాడు జిల్లా కేంద్రం సాధన కోసం పలు సంఘాలతో కలసి ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు.

ఇదీ చదవండీ... ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ.. ఎన్నికల కమిషనర్​కు.. సీఎస్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.