గుంటూరు జిల్లా బ్రాడీపేటలో.. ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. యువతి ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేయగా.. యువకుడు ప్రైవేటు బ్యాంకులో పని చేసినట్టు గుర్తించారు. యువతి 2 రోజుల నుంచి ఇంటికి రాకపోవడంపై ఆందోళనతో.. వారి తల్లిదండ్రులు గుంటూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు యువతి మొబైల్ ఆధారంగా బ్రాడిపేటలో ఉన్నట్టు టవర్ లొకేషన్ చూపించడంతో... ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. ప్రైవేటు బ్యాంకులో పురుగుల ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ప్రేమ వివాహాన్ని పెద్దలు అంగీకరించకపోవటంతోనే ఇద్దరూ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: