గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో మద్యం మత్తులో వాహనాన్ని నడుపుతూ ఓ లారీ డ్రైవర్ చెట్టుని ఢీకొట్టాడు. ఈ ఘటనలో లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను స్థానికులు శ్రమించి బయటకు తీశారు. విజయవాడ నుంచి ఐరన్ షీట్ల లోడును కర్ణాటక రాష్ట్రం బళ్లారికి తీసుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీని నడుపుతున్న డ్రైవర్ ఎం భరత్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. సుమారు అర గంటపాటు స్థానికులు కష్టపడి క్యాబిన్లో చిక్కుకుపోయిన డ్రైవర్‌ను బయటకు తీశారు. లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం అతనిని అంబులెన్స్‌లో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: బైక్‌ను ఢీకొన్న ఇసుక టిప్పర్...ముగ్గురికి గాయాలు