ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. జగ్గుస్వామికి లుక్​అవుట్​ సర్య్కులర్ - look out circular to bl santosh

LOOK OUT CIRCULAR : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కేరళలో జగ్గుస్వామి అందుబాటులో లేకపోవడంతో నిన్న ఆయనకు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసింది.

LOOK OUT CIRCULAR
LOOK OUT CIRCULAR
author img

By

Published : Nov 22, 2022, 12:05 PM IST

Updated : Nov 22, 2022, 2:56 PM IST

LOOK OUT NOTICE : తెలంగాణలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్​ దర్యాప్తు ముమ్మరం చేసింది. కేరళలో జగ్గుస్వామి అందుబాటులో లేకపోవడంతో నిన్న జగ్గుస్వామికి లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్​ సంతోశ్​, తుషార్, జగ్గుస్వామిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. విచారణకు సహకరించాలని బీఎల్​ సంతోశ్​కు హైకోర్టు ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది.

LOOK OUT CIRCULAR
లుక్​అవుట్ సర్క్యులర్ జారీ

మరోవైపు నిన్న శ్రీనివాస్​ను సిట్ అధికారులు దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు. సింహయాజీతో ఉన్న సంబంధాలపై సేకరించిన ఆధారాలను ముందు పెట్టుకొని మరీ ప్రశ్నించారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఫామ్​హౌస్​లో జరిగిన సంప్రదింపులపై తనకు ఏమాత్రం అవగాహన లేదని శ్రీనివాస్ చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నందకుమార్​తోనూ శ్రీనివాస్​కు సత్సంబంధాలే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే న్యాయవాది శ్రీనివాస్​ నేడు మరోసారి సిట్​ ఎదుట హాజరయ్యారు. సిట్ అధికారులు అడిగిన వివరాలతో విచారణకు హాజరయ్యారు.

ఇవీ చూడండి..

Last Updated : Nov 22, 2022, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.