లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అండగా నిలిచారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ బాధ్యులుగా ఉన్న ఆయన.. పట్టణంలోని 500 మంది చేనేత కార్మికులకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేయించారు. మంగళగిరిలో చేనేత కార్మికులు అధికంగా నివసించే రత్నాల చెరువు ప్రాంతంలో ఉన్న వారికి లోకేశ్ పంపించిన బియ్యం, కూరగాయలను తెదేపా నేతలు అందించారు.
చేనేత కార్మికులకు అండగా లోకేశ్ - చేనేత కార్మికులకు అండగా నిలిచిన లోకేశ్
లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక నిరాశ్రయులైన చేనేత కార్మికులను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో 500 చేనేత కుటుంబాలకు తన అభిమానులతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయించారు.
చేనేత కార్మికులకు అండగా లోకేశ్
లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అండగా నిలిచారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ బాధ్యులుగా ఉన్న ఆయన.. పట్టణంలోని 500 మంది చేనేత కార్మికులకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేయించారు. మంగళగిరిలో చేనేత కార్మికులు అధికంగా నివసించే రత్నాల చెరువు ప్రాంతంలో ఉన్న వారికి లోకేశ్ పంపించిన బియ్యం, కూరగాయలను తెదేపా నేతలు అందించారు.
Last Updated : May 1, 2020, 11:48 AM IST