గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వర్ణకారుల సంఘం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తెదేపా నేత నారా లోకేశ్ ప్రారంభించారు. స్వర్ణకారుల సంక్షేమం కోసం ఆయన 5 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో... అధికార పార్టీకి భయం మొదలైందని లోకేశ్ ఎద్దేవా చేశారు. మిగతా విడతల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పారు.
తెలంగాణలో వైయస్ షర్మిల పార్టీ ప్రకటనను..... వైకాపా నేతలు అంగీకరించలేకపోతున్నారని ఆయన అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో వైకాపా చేసే ప్రకటనలను అక్కడ కార్మికులే అంగీకరించడంలేదని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటుపరం కాకుండా పోరాటం చేస్తామని చెప్పారు.
ఇదీ చూడండి: