ETV Bharat / state

గుంటూరు జిల్లాలో పటిష్టంగా లాక్​డౌన్​

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరగటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. లాక్​డౌన్​ను అధికారులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. లాక్​డౌన్​ ఉల్లంఘనులపై భారీగా కేసులు నమోదు చేస్తున్నారు.

author img

By

Published : Apr 5, 2020, 3:28 PM IST

lockdown in gutur
lockdown in gutur
గుంటూరులో పటిష్టంగా లాక్​డౌన్​ అమలు

గుంటూరు జిల్లాలో 13వ రోజు లాక్​డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రహదార్లపైకి అత్యవసరమైతే తప్ప ఎవరినీ అనుమతించడం లేదు. గుంటూరులో నిన్న ఒకేరోజు 10 కేసులు.. ఒకే ఇంట్లో 5 కేసులు నమోదు కావడం తీవ్రతను తెలియజేస్తోంది. జిల్లాలో నాలుగు రోజుల వ్యవధిలో 21 పాజిటివ్ కేసులు నిర్ధరణ కావటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. లాక్​డౌన్​ను మరింత పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉదయం 9 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరకుల కొనుగోలుకు అనుమతిస్తున్నారు. రహదార్లపైకి వస్తున్న వాహనాలను పోలీసులు నియంత్రిస్తున్నారు. లాక్​డౌన్ ఉల్లంఘనులపై ఇప్పటివరకు 13 రోజుల్లో 426 కేసులను నమోదు చేయగా... 1916 మందిని నిందితులుగా గుర్తించారు. 1609 వాహనాలను, 49 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 110 దుకాణాలపై కేసులు నమోదు చేశారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగటంతో గుంటూరు నగరంతో పాటు మాచర్ల, అచ్చంపేట, మంగళగిరి, క్రోసూరు, మేడికొండూరులో రెడ్​జోన్లు ఏర్పాటు చేసిన అధికారులు రాకపోకలను నిషేధించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 226కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.