గుంటూరు జిల్లా మంగళగిరిలో రేపటి నుంచి లాక్డౌన్కు సడలింపులు ఇవ్వనున్నారు. మంగళగిరిలో కరోనా పాజిటివ్ కేసులు సున్నాకు రావటంతో లాక్డౌన్లో సడలింపులివ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నియోజకవర్గ అధికారులతో శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సడలింపులో కచ్చితంగా నిబంధనలు పాటించాలని అధికారులకు సూచించారు. మరో కేసు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వస్త్ర, ఆభరణాలు, పాదరక్షల దుకాణాలు మినహా అన్నింటికి అధికారులు అనుమతులిచ్చారు.
ఇదీ చూడండి ప్రతి పరిశ్రమకు తక్కువ వడ్డీకే రుణాలు: సీఎం