గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా లాక్డౌన్ ఆంక్షలు కఠినతరం చేసినట్లు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటల వరకే వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాలకు అనుమతిస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దుకాణాలు మూసివేయాలని సూచించారు. కేవలం మందుల దుకాణాలకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. ఉదయం 11గంటల తర్వాత అనవసరంగా ఎవరూ వాహనాలతో రోడ్లపైకి రావొద్దని తెలిపారు. బైక్ పై ఒకరు, ఆటోలో ఇద్దరు, కార్లలో ముగ్గురు, పెద్ద కార్లలో ఐదుగురికి అనుమతిస్తున్నట్లు వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్ఛరించారు. కంటైన్మెంట్ జోన్లలో కిరాణా, కూరగాయలు, పాల దుకాణాలు మాత్రమే ఉంటాయని తెలిపారు. అక్కడి ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ ప్రారంభం