CM Jagan tour in Guntur: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే జనం భయపడే పరిస్థితి నెలకొంది. సీఎం పర్యటన పేరుతో రెండు రోజుల ముందు నుంచే రోడ్లకు ఇరువైపులా కంచెలు కట్టేసి, ఆంక్షలు విధిస్తుండటం.. ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. రేపు గుంటూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి భద్రత కోసమంటూ... ఆయన ప్రయాణించే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఇనుప బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటినుంచే కంచెలు కట్టడంతో రోడ్డు పక్కనున్న నివాసితులు, దుకాణాల నిర్వాహకులకు ఇక్కట్లు తప్పడం లేదు.
రేపు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని 11న గుంటూరులో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. అనంతరం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడులో సుగంధ ద్రవ్యాల పార్క్‌ను సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. అక్కడ ఐటీసీ సంస్థ నిర్మించిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు.
ఇవీ చదవండి: