ప్రమోషన్లకు సంబంధించిన కీలక జాబితా.. జిల్లా పాలనాధికారి ఆమోదం పొందకుండా సామాజిక మాధ్యమాల్లో చేరింది. ఈ విషయమై గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో)ని ప్రభుత్వానికి సరండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వలు జారీ చేశారు. ఇటీవల వీఆర్ఏలుగా పనిచేస్తూ అర్హులైన వారిని ఉద్యోగోన్నతిపై వీఆర్వోలుగా నియమించారు. జిల్లా వ్యాప్తంగా 400 మందికిపైగా ఈ జాబితాలో ఉన్నారు. ఇది పాలనాధికారి ఆమోదం పొందక ముందే సామాజిక మాధ్యమాల్లో కనిపించింది.
విషయాన్ని ఈనాడు - ఈటీవీ భారత్ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ విషయంపై నగరంపాలెం పీఎస్‌లో సైబర్ క్రైం కింద ఫిర్యాదు చేశారు. ఒకరిని విధుల నుంచి తప్పించారు. పాలనాధికారి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే డీఆర్‌వో సత్యనారాయణను రెవెన్యూ శాఖకు సరండర్ చేస్తూ రెండ్రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన బాధ్యతలను జిల్లా సంయుక్త పాలనాధికారి పి.ప్రశాంతికి అప్పగించారు.
ఇదీ చదవండి: