గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామం వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని గుర్తించారు. 576 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం విలువ రూ.70,000 ఉంటుందని అంచనా వేశారు. ముగ్గురిని అరెస్టు చేసి.. ఆటోను సీజ్ చేశారు.
నాదెండ్లకు చెందిన ఒక వ్యక్తి గత కొన్ని నెలలుగా హైదరాబాద్ వనస్థలిపురం నుంచి పార్సిల్లో మద్యం అక్రమంగా తీసుకువచ్చి.. యడ్లపాడు, తిమ్మాపురం, నాదెండ్ల ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చిందని అధికారులు తెలిపారు. నాలుగు రోజులుగా నిఘా పెట్టి.. మంగళవారం సాయంత్రం జాతీయ రహదారి నుంచి తిమ్మాపురం గ్రామానికి ఆటోలో తీసుకెళ్తుండగా పట్టుకున్నామన్నారు.
ఇదీ చదవండి: