'మన సంకల్పం ముందు కరోనా ఓడిపోవాలి... మన ఐక్యత చూసి వైరస్ బెదిరిపోవాలి.... కరోన వైరస్ మనల్ని ఏమీ చేయలేదనటానకి ఇదిగో ఈ వెలుగుతున్న దీపాలే సాక్ష్యం' అంటూ గుంటూరు జిల్లా చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజిని కుటుంబ సభ్యులతో దీపాలు వెలిగించారు.
హోం మంత్రి సుచరిత:
ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రజలంతా తమ ఐక్యతను చాటి చెప్తూ దీపాలు వెలిగించటం గొప్ప విషయమని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించారు. వైద్యులు, పోలీసులు, మీడియా చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటూ ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.
ఎమ్మెల్యే గద్దె రామమోహన్:
విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఆయన సతీమణితో కలిసి 9 దీపాలను వెలిగించారు. కరోనా వైరస్‌ను పారద్రోలాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి:
కడప జిల్లా పులివెందులలో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దీపాలను వెలిగించారు. కరోనా నివారణపై ప్రజల తోడ్పాటు అభినంచదగ్గదని ఎంపీ కితాబునిచ్చారు.
మాజీ మంత్రి దేవినేని ఉమా:
మాజీ మంత్రి దేవినేని ఉమా తన నివాసంలో కరోనా మహమ్మారి కట్టడికి దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలనకు అనుగుణంగా కొవిడ్‌ను తరిమి కొట్టడంలో ప్రజల వంతు సాయం చేయాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: కరోనా భూతంపై జనభారతం ఐక్య పోరాటం