నిమ్మ పంటలకు ప్రసిద్ధి చెందిన గుంటూరు జిల్లా తెనాలి పరిసర ప్రాంతాల రైతులు వరుసగా రెండో ఏడాదీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది కరోనా కొట్టిన దెబ్బ నుంచి ఇంకా తేరుకోకముందే మరోసారి ఆ మహమ్మారి విజృంభించటంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులంతా ఆందోళనలో ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు ఇక్కడ్నుంచే నిమ్మ ఎగుమతులు జరిగేవి. ప్రస్తుతం ఎక్కడికక్కడ కరోనా ఆంక్షలు ఉండటంతో పంట అంతా తోటల్లోనే ఉండిపోయింది.
ఇదీచదవండి.: కరోనా కల్లోలం : మనస్థాపంతో బావిలో దూకి కుటుంబం ఆత్మహత్య