జగన్ చెప్పిన 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో నిరసనలు కొనసాగుతున్నాయి. కర్నూలులో హైకోర్టు వద్దని అమరావతినే రాజధానిగా ఉంచాలని న్యాయవాదుల జేఏసీ తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో డిమాండ్ చేసింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మాజీ ఛైర్మన్ మోహన్ క్రేన్‌కు వేలాడుతూ నిరసన తెలిపారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ తెదేపానేతలు ర్యాలీ చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో రైతులకు మద్దతుగా తెదేపా శ్రేణులు ధర్నా చేశారు. రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. తుళ్లూరులో రైతులు చేస్తున్న ఆందోళనను పోలీసులు అడ్డుకుని మంగళగిరి స్టేషన్‌కు తరలించారు. రాజధాని ప్రాంత రైతులకు న్యాయవాదుల జేఏసీ మద్దతు తెలిపింది
ఇదీ చూడండి