గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 144 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మెుత్తం బాధితుల సంఖ్య 71 వేల 776కు చేరుకుంది. నేడు నమోదైన కేసుల్లో గుంటూరు నగర పరిధి నుంచి 44 కేసులు నిర్ధరణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. చిలకలూరిపేట-10, తాడేపల్లి-7, తెనాలి-6, నరసరావుపేట-5 కేసుల చొప్పున నమోదైనట్లు అధికారులు తెలిపారు.
కొవిడ్ కారణంగా జిల్లాలో ఇవాళ ఒకరు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 642కి పెరిగింది. వైరస్ బారినపడి 69,410 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా ఎక్కువగా మరణాలు సంభవిస్తున్న జిల్లాల్లో గుంటూరు రెండవ స్థానంలో ఉంది.
ఇదీచదవండి