గుంటూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో 444 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 58,386కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 77 ఉన్నాయి. భట్టిప్రోలు 53, తెనాలి 30, నరసరావుపేట 28, సత్తెనపల్లి 18, తాడేపల్లి 15, మంగళగిరి 15, అమృతలూరు 12, ముప్పాళ్ల 11, తాడికొండ 11, చిలకలూరిపేట 11, శావల్యాపురం 11, కొల్లూరు 11, కొల్లిపరలో 10 కేసుల చొప్పున నమోదయ్యాయి.
జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 51 వేల 499 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ కారణంగా సోమవారం ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 546కు చేరింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల ఎక్కువ మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇదీచదవండి