ల్యాండ్ రోవర్, జాగ్వార్ నూతన బీఎస్6 కార్ల ఆవిష్కరణ - undefined
విలాసవంతమైన కార్ల తయారీ సంస్థలు ల్యాండ్ రోవర్, జాగ్వార్ రూపొందించిన బీఎస్6 స్పోర్ట్స్ కార్లను ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీ జాగ్వార్ షోరూంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో డిస్కవరీ స్పోర్ట్స్, రేంజ్ రోవర్ ఇవోక్ కార్లను సీఈవో వెంకటేష్ ఆవిష్కరించారు. బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా ఈ కార్లను తయారు చేశామని సీఈవో చెప్పారు. భద్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించామన్నారు. ఈ వాహనాల్లో వినియోగదారుడికి నూతన అనుభూతి కలుగుతుందని ఆయన అన్నారు. డిస్కవరీ స్పోర్ట్స్ ఎక్స్ షోరూం ధర 57లక్షలు, రేంజ్ రోవర్ ఇవోక్ ఎక్స్ షోరూం ధర 54లక్షలు ఉంటుందని చెప్పారు.
ల్యాండ్ రోవర్, జాగ్వార్ నూతన BS6 స్పార్ట్స్ కార్ల ఆవిష్కరణ
By
Published : Mar 16, 2020, 4:20 PM IST
ల్యాండ్ రోవర్, జాగ్వార్ నూతన BS6 స్పార్ట్స్ కార్ల ఆవిష్కరణ