ETV Bharat / state

'రేషన్​ సరకులు వాలంటీర్లతో ఇప్పించండి' - mla sridevi distribute vegitables in guntur dst

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రేషన్ ​సరకుల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సాంకేతిక లోపం, సర్వర్ ​సమస్యతో అధికారులు విసుగెత్తిపొత్తున్నారు. మరో వైపు తెల్లవారుజాము నుంచే దుకాణాలకు వచ్చిన ప్రజలు... వాలంటీర్లకు జీతాలెందుకు ఇస్తున్నారు? వారితో సరుకులు ఇంటికి పంపించాలని డిమాండ్​ చేశారు.

ladies fire on govt about ration goods distribution in guntur dst

author img

By

Published : Mar 30, 2020, 7:03 PM IST

రేషన్​ సరకులను వాలంటీర్లతో పంపిణీ చేయాలంటున్న మహిళలు

రేషన్​ సరుకుల కోసం గుంటూరులో చౌకధరల దుకాణాల ముందు ప్రజలు పడిగాపులు కాశారు. తెల్లవారుజామున 3గంటలకు క్యూ లో నిలుచుంటే పట్టించుకునే నాథుడే లేడని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కందిపప్పు, బియ్యంతోనే అధికారులు బతుకుతున్నారా? తమకు మాత్రం ఇవి ఇచ్చి ఎందుకు చేతులు దులుపుకొందాం అనుకుంటున్నారంటూ... వృద్ధులు ప్రభుత్వాన్ని నిలదీశారు. రేషన్​ దుకాణాల ముందు జనాలు కిక్కిరిసిపోతుంటే లాక్​డౌన్​ పెట్టడంలోని లక్ష్యం నీరుగారిపోలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల ద్వారా రేషన్​ సరుకులు ఇంటికి పంపిస్తే ఈ సమస్యలు తలెత్తవని ఆశాభావం వ్యక్తం చేశారు.

కూరగాయలు పంపిణీచేస్తున్న ఎమ్మెల్యే శ్రీదేవి

మరోవైపు.. తాడికొండ నియోజకవర్గం శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి మాస్కులు, కూరగాయలు మేడికొండూరు మండలం పేరేచర్లలో పంపిణీ చేశారు. ప్రాణాంతకమైన కరోనా వైరస్​ నిర్మూలించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని తెలిపారు.

ఇదీ చూడండి:

లాక్​డౌన్: నిరాశ్రయులకు అండగా అధికార యంత్రాంగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.