విజయవాడకు చెందిన యువతి జూన్ 19న రాత్రి కాబోయే భర్తతో కలిసి విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా సీతానగరం పుష్కరఘాట్ వైపు వెళ్లారు. అక్కడ ఇసుక తిన్నెలపై కూర్చొని ఉండగా.. అక్కడ మాటేసిన ఇద్దరు దుండగులు.. వెనుకవైపు నుంచి ఒక్కసారిగా వారిపై దాడి చేశారు. చంపేస్తామని బెదిరించి.. యువకుడిని బాధితురాలిని చున్నీతో కాళ్లు చేతులు కట్టేశారు. తర్వాత ఇద్దరూ యువతిపై అత్యాచారం చేశారు. బాధితురాలి ముఖాన్ని ఇసుకలో కుక్కేసి, ఊపిరాడనివ్వకుండా చేసి పాశవికంగా అకృత్యానికి పాల్పడ్డారు. బాధితురాలు విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటకు చెందిన 20ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని శిక్షణలో భాగంగా విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సేవలందిస్తున్నారు. విధులు ముగిశాక ప్రకాశం బ్యారేజీ మీదుగా సీతానగరం పుష్కరఘాట్ వైపు వచ్చారు.
తర్వాత.. యువ జంట వద్ద నుంచి సెల్‌ఫోన్లు, డబ్బు, బాధితురాలి చెవిదిద్దులు దోచుకొని పారిపోయారు. 4 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టగా...ప్రధాన నిందితుడు కృష్ణకిషోర్ శనివారం విజయవాడ రైల్వే ట్రాక్‌పై వెళ్తూ చిక్కాడు. విచారణలో మరో విషయం తెలిసింది. అత్యాచార ఘటనకు ముందు నిందితులు కృష్ణకిషోర్, ప్రసన్న రెడ్డి ఇద్దరూ రాగి తీగలు చోరీ చేస్తుండగా.. ఓ వ్యక్తి చూశాడు. ఎవరికైనా చెబుతాడేమోనని నిందితులు అతనిని హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని కృష్ణ నదిలో పడేశారు. మద్యం తాగి సమీపంలో ఇసుక తిన్నెలపై కూర్చున్న జంటపై కిరాతకానికి పాల్పడ్డారు. బాధితుల నుంచి దోచుకెళ్లిన సెల్‌ఫోన్లు, డబ్బు, చెవిదిద్దులను కృష్ణ కిశోర్ తన స్నేహితుడైన హబీబ్ వద్ద తాకట్టు పెట్టాడు. ఈ కేసులో అతడినీ అరెస్టు చేశారు. మరో నిందితుడు ప్రసన్న రెడ్డి కోసం గాలిస్తున్నారని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు.
"కృష్ణ కిషోర్ సీలింగ్ వర్క్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి తాడేపల్లి మహానాడు ఏరియాకి చెందిన ప్రసన్నరెడ్డి అలియాస్ వెంకట్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ జల్సాల కోసం చోరీల బాట పట్టారు. రైల్వే పట్టాలపై కాపర్ వైర్లు దొంగిలించి అమ్మేవారు. జూన్ 19న యువతిపై అత్యాచారం చేసిన తర్వాత కృష్ణా నదిలో లంగరు వేసి ఉన్న పడవ వేసుకొని విజయవాడ వైపు నిందితులు పారిపోయారు. రాత్రంతా రాణిగారి తోటలో నది ఒడ్డున పడుకున్నారు. మరుసటి రోజు తాడేపల్లి నుంచి ఒంగోలు వెళ్లి ఒకరోజు ఉండి..అక్కడి నుంచి ఇద్దరూ చెరోవైపు వెళ్లిపోయారు. సుమారు 50 రోజులు పోలీసులకు కనిపించకుండా తిరిగిన కృష్ణ కిషోర్.. సికింద్రాబాద్ నుంచి రైల్లో విజయవాడకు వచ్చి పట్టాల మీదుగా తాడేపల్లి వైపు వెళ్తుండగా పట్టుకున్నారు. విచారణలో హత్య, అత్యాచారం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు." -దుర్గాప్రసాద్, గుంటూరు నార్త్ డీఎస్పీ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృస్టించిన కేసును చేధించడానికి పోలీసులు 50 రోజులకు పైగా శ్రమించారని ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: