గుంటూరు జిల్లా కోటప్పకొండ వద్ద విద్యుత్తు ప్రభలు నిర్మించే.. చిలకలూరిపేట ప్రాంత నిర్వాహకులు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్థానిక పోలీసులు తెలిపారు. మహాశివరాత్రి నేపథ్యంలో తిరునాళ్లకు ప్రభలు నిర్మించే కావూరు , మద్దిరాల, అప్పాపురం, అమీన్ సాహెబ్ పాలెం, కమ్మవారిపాలెం, యడవల్లి గ్రామాల వారితో సీఐ సుబ్బారావు సమావేశమయ్యారు. 30 అడుగుల మించకుండా ప్రభలు నిర్మించుకోవాలని నిర్వాహకులకు చెప్పారు. కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని వివరించారు. తిరునాళ్లలో అసభ్యకరమైన పాటలు.. అశ్లీల నృత్యాలు.. కుల, మత, వర్గాలకు సంబంధించిన గీతాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాలు భక్తితో శివరాత్రి ఉత్సవాలు జరుపేవిధంగా కోటప్పకొండ ప్రభలు నిర్మించాలని సీఐ కోరారు.
ఇదీ చదవండి: 'ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తా'