మహాశివరాత్రికి ముందు కోటప్ప కొండ తిరణాలు అంటే గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్మించే విద్యుత్ (వెలుగులు చిమ్మే) ప్రభలు ప్రజలందరికీ గుర్తొస్తాయి. నిర్మాణం పూర్తయ్యాక గ్రామంలో పండుగ చేసి.. శివరాత్రి ముందు రోజు కోటప్పకొండకు బయలుదేరడం ఆనవాయితీ.
ఈసారి పట్టణంలో పురపాలక ఎన్నికలు ఉండటంతో రెండు రోజుల ముందుగానే (సోమవారం) సాయంత్రం కోటప్ప కొండకు ప్రభలు బయల్దేరాయి. ప్రభలు ఎక్కువగా నిర్మించే పురుషోత్తమ పట్నంలో ముందుగానే వీటిని ఏర్పాటు చేసుకుని తీసుకువచ్చారు. గ్రామ ప్రభ, విడదల వారి ప్రభ, బైరా వారి ప్రభ ఇలా పది ఇల్ల పేర్లతో ఏర్పాటు చేసిన ప్రభలు భక్తుల కోలాహలం మధ్య కొండకు చేరుకోనున్నాయి. ఎమ్మెల్యే విడదల రజిని ప్రభను నడిపి సందడి చేశారు.
ఇదీ చదవండి: