గుంటూరు జిల్లాలో 15 చోట్ల పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి.. వరద బాధితులను తరలిస్తున్నారు. 3వేల500 మంది వరద బాధితులు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ముంపు ప్రాంతాల నుంచి మిగతావారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు అవసరమైన మంచినీరు, ఆహారం అందిస్తున్నారు. ప్రతి కేంద్రం వద్ద వైద్య సాయం అందించేందుకు డాక్టర్తో పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అనారోగ్యానికి గురైన వారికి చికిత్స అందజేస్తున్నారు. పారిశుద్ధ్యంతో పాటు ఆరోగ్యంపైనా వరద బాధితులకు అవగాహన కల్పిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు అందుతున్నాయని బాధితులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.