మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల ఆయన ఆప్త మిత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. 1980లో కోడెల వైద్య వృత్తిలో అడుగుపెట్టిన నాటి నుంచి తమ స్నేహం విడదీయరానిదని అన్నారు. కోడెల రాజకీయ ప్రవేశం తర్వాత కూడా ఎన్నికల్లో ఆయన తరఫున ప్రచారం చేసినట్లు కోడెల స్నేహితులు తెలిపారు. ఎంతో సరదాగా కుటుంబాలతో కలిసి ఉండేవాళ్లమని ఆయన మరణం తమకు తీరని లోటని అన్నారు. కోడెల ఉన్నా లేకపోయినా తాము బతికున్నంత కాలం ఆయన జ్ఞాపకాలు తమను వీడి పోవని బాధాతప్త హృదయాలతో వెల్లడించారు.
ఇదీ చూడండి : 'కోడెల... మహిళలను ఎంతో ప్రోత్సహించేవారు'