ప్రభుత్వ వేధింపుల వల్లే మాజీ సభాపతి కోడెల ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. ఆయన మృతికి ప్రభుత్వమే కారణమంటూ తెదేపా నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆరోపించారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోడెల అమర్‌రహే అంటూ శ్రద్ధాంజలి ఘటించారు. గుంటూరులోని లాడ్జి సెంటర్ నుంచి తెదేపా కార్యాలయం వరకు సాగిన ఈ ప్రదర్శనలో పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: