ETV Bharat / state

దిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

KCR Inaugurated BRS Party Office: దేశ రాజధాని దిల్లీలో భారత్‌ రాష్ట్ర సమితి బీఆర్​ఎస్ జాతీయ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్‌యాదవ్‌, కుమారస్వామితో పాటు వివిధ పార్టీల ఎంపీలు, నాయకులు హాజరయ్యారు. మరోవైపు ముందే నిర్ణయించబడిన రెండు కీలకమైన సమావేశాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.

KCR Inaugurated BRS
KCR Inaugurated BRS
author img

By

Published : Dec 14, 2022, 4:14 PM IST

దిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

KCR Inaugurated BRS Party Office: దిల్లీలో బీఆర్ఎస్​ జాతీయ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. మధ్యాహ్నం 12:47 గంటలకు తొలుత పార్టీజెండాను ఆవిష్కరించిన కేసీఆర్.. అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయంలో రాజశ్యామల, నవచండీ యాగాల్లో కేసీఆర్‌ దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు హాజరయ్యారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్‌యాదవ్‌, కుమారస్వామితో పాటు వివిధ పార్టీల ఎంపీలు, ఇతర నాయకులు హాజరయ్యారు. కేసీఆర్‌ సమక్షంలో వివిధ పార్టీల నేతలు బీఆర్​ఎస్​లో చేరనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఈ ఉదయం దిల్లీ చేరుకోవాల్సిన మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి ప్రత్యేక అనుమతితో రాలేకపోతున్నట్లు వెల్లడించారు. ముందే నిర్ణయించబడిన రెండు కీలకమైన సమావేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.