ఆంధ్ర పారిస్ గా పిలవబడే తెనాలిలోని ప్రభుత్వ ఆసుపత్రి.. గుంటూరు తరువాత అతి పెద్ద జిల్లా ఆసుపత్రిగా పేరుగాంచింది. దీంతోపాటుగా మరో ఘనతను సాధించింది. జాతీయస్థాయి కాయకల్ప అవార్డులో గుంటూరు జిల్లాలోని తెనాలి ప్రభుత్వ వైద్యశాల.. తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ అవార్డు ద్వారా 20 లక్షల నగదు బహుమతి అందుతుందని తెనాలి డివిజన్ సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది సమష్టి కృషి వల్లే ఈ పురస్కారం దక్కిందన్న ఆయన...వారందరికీ అభినందనలు తెలిపారు.
ఈ అవార్డు ఎంపికకు ఆసుపత్రి భవనాలు, శానిటేషన్, వేస్ట్ మేనేజ్మెంట్, ఇన్ఫెక్షన్ కంట్రోల్, సపోర్ట్ సర్వీసెస్, హైజీన్ ప్రమోషన్స్, ఆసుపత్రి చుట్టూ ప్రహరీ గోడ వంటి నిర్మాణాలు.. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని అవార్డు గ్రహీతలను ఎంపిక చేస్తారని ఆయన పేర్కొన్నారు. ద్వితీయ స్థానం తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి లభించింది. మెరుగైన వైద్య సేవలను అందించడం ద్వారా పురస్కారం దక్కిందని.. ఆసుపత్రి ప్రధాన వైద్యురాలు స్వప్నకు పలువురు అభినందనలు తెలిపారు.
ఇవీ చూడండి:
కరోనాతో మాజీ సైనికుడు మృతి... మృతదేహం తీసుకొస్తూ మరో వ్యక్తి మరణం