ETV Bharat / state

రోడ్డు ప్రమాదం.. ఆ కుటుంబ అండను తీసుకెళ్లిపోయింది!

author img

By

Published : May 30, 2020, 9:43 AM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కావూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మలేషియాలో ఉన్న కుమార్తెను చూసేందుకు పాస్​పోర్టు దరఖాస్తు నిమిత్తం విజయవాడకు వెళ్లిన మహిళ.. తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.

రోడ్డు ప్రమాదం.. ఆ కుటుంబ అండను తీసుకెళ్లిపోయింది!
రోడ్డు ప్రమాదం.. ఆ కుటుంబ అండను తీసుకెళ్లిపోయింది!

భర్త చనిపోయినా... కుటుంబ బాధ్యతను భుజానికి ఎత్తుకుంది. కష్టపడి పిల్లలిద్దర్నీ ప్రయోజకులను చేసింది. కష్టాలు తొలిగాయన్న సమయంలో మృతువు కబళించింది. తండ్రిని గతంలోనే కోల్పోయిన ఆ పిల్లలకు.. ఇప్పుడు తల్లి కూడా దూరమైపోయింది.

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కావూరు గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వెంకట నారాయణ, శివపార్వతి దంపతులకు కుమార్తె, కుమారుడు. పిల్లల చిన్నతనంలోనే వెంకట నారాయణ మరణించాడు. ఆ ఆవేదనను దిగమింగి... శివపార్వతి కుటుంబ బాధ్యతలు తీసుకుంది. తనకున్న పొలాన్ని సాగు చేసుకుంటూ, కుట్టు మిషన్ కుడుతూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. కుమార్తెను బీటెక్ చదివించి వివాహం చేసింది. ప్రస్తుతం కుమార్తె, అల్లుడు మలేషియాలో ఉంటున్నారు. కుమారుడు బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

మలేషియాలో ఉన్న శివపార్వతి కుమార్తె ఇప్పుడు గర్భవతి. ఆమె కాన్పు కోసం శివపార్వతి మలేషియా వెళ్లేందుకు నిర్ణయించింది. అందుకు కావాల్సిన పాస్‌పోర్ట్ కోసం కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై బుధవారం విజయవాడ వెళ్లింది. పని పూర్తి చేసుకుని తిరిగి కావూరుకు వస్తున్న సమయంలో తిమ్మాపురం వద్ద శివపార్వతి చుట్టుకున్న స్కార్ఫ్ ద్విచక్రవాహనం వెనక టైరులో చిక్కుకుంది. ఈ ఘటనలో శివపార్వతి వెనుకకు పడి తీవ్రంగా గాయపడింది.

ఆమెను చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరులోని ఆసుపత్రికి పంపించారు. తలకు తీవ్ర గాయం అవడం వల్ల వైద్యులు శస్త్రచికిత్స చేసినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించి శివపార్వతి మృతి చెందారు. ఇన్నాళ్లు అండగా ఉన్న తల్లి మృతి చెందిన కారణంగా.. కుమారుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు.

కడచూపునకు నోచుకోలేని కుమార్తె

తల్లి మరణవార్త తెలుసుకున్న కుమార్తె దుఖఃంలో మునిగిపోయింది. మాతృమూర్తి మృతదేహాన్ని కడచూపు చూసేందుకు కూడా నోచుకోలేకపోతున్నానని తల్లడిల్లింది. కష్టపడి పనిచేసుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన శివపార్వతి మృతి చెందడం కావూరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది.

ఇదీ చదవండి:

గవర్నర్​ సంతకం లేకుండానే ఎస్​ఈసీ నియామక ఆర్డినెన్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.