కార్తికమాసం మొదటి సోమవారం సందర్భంగా గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజామున మొదలైన త్రికోటేశ్వరుని దర్శనానికి అయ్యప్పస్వాములు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధికసంఖ్యలో బారులు తీరారు. కొండకు వచ్చే భక్తుల కోసం ఆలయ సిబ్బంది కొవిడ్ జాగ్రత్తలు తీసుకున్నారు. కోటప్పకొండ త్రికోటేశ్వరుని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తేనే స్వామి దర్శనానికి అనుమతించారు.
ఆలయ నిర్వహకులు త్రికోటేశ్వరస్వామికి ప్రత్యేక అభిషేకాలు ఏర్పాటు చేశారు. కోటప్పకొండకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. కార్తీకమాసం మొదటి సోమవారం పురస్కరించుకుని సుమారు 2వేల మంది భక్తులు త్రికోటేశ్వరుని దర్శించుకున్నారని ఆలయ ఈఓ రామకోటిరెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: జగన్ లేఖ కేసులో.. విచారణ ధర్మాసనం నుంచి తప్పుకున్న జస్టిస్ లలిత్ కుమార్