గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఉద్యోగ మేళా తొలిరోజు విజయవంతంగా ముగిసింది. మొదటి రోజు లోమా ఐటీ సంస్థ అత్యధికంగా 11 లక్షల వార్షిక ప్యాకేజీతో ప్లేస్మెంట్ ఇచ్చింది. సీఎఫ్‌ఎల్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్ క్లస్టర్ మేనేజర్‌గా ఎంపిక చేసుకున్న అభ్యర్థికి రూ.5 లక్షల 47 వేల ప్యాకేజీ ఇచ్చారు. మొదటి రోజు 142 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించగా.. 7,473 మందికి ఉద్యోగాలు లభించాయి. 1,562 మందిని షార్ట్‌లిస్ట్ చేయగా.. వీరికి ఆదివారం రెండో రౌండ్ ఇంటర్వ్యూలు జరగనున్నాయి.
ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఎంపీ విజయసాయిరెడ్డి ఆఫర్ లెటర్లు అందచేశారు. ఉద్యోగ మేళాలో జాబ్ రాని వారికి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసి ఉద్యోగాలిస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
ఇవీ చూడండి