ETV Bharat / state

కరోనా నియంత్రణ చర్యలపై జేసీ సమావేశం - Jc meeting on corona control at guntur news udpate

ఉద్దేశపూర్వకంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని జేసీ దినేష్​ కుమార్​ తెలిపారు. కరోనా వైరస్ నివారణ చర్యలపై శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్​లో గుంటూరు సంయుక్త కలెక్టర్.. డివిజన్ స్థాయి రిసెప్షన్ సెంటర్ నోడల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.

Jc meeting on corona control
కరోనా నియంత్రణ చర్యలపై జేసీ సమావేశం
author img

By

Published : Jul 17, 2020, 11:56 PM IST

కరోనా వైరస్ నివారణ చర్యలపై గుంటూరు సంయుక్త కలెక్టర్.. డివిజన్ స్థాయి రిసెప్షన్ సెంటర్ నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా జిల్లా స్థాయిలో ఉన్న రిసెప్షన్ సెంటర్ నుంచి నోడల్ అధికారులు నివారణ చర్యలను పర్యవేక్షించడం సాధ్యం కావడం లేదని జేసీ దినేష్​ కుమార్​ అన్నారు. నగరపాలక సంస్థతో పాటు, గుంటూరు, తెనాలి, నరసరావుపేట, దాచేపల్లి రెవిన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం ఐదు రిసెప్షన్ సెంటర్ల ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డివిజన్ స్థాయిలో నియమించిన నిఘా, నిర్వహణ బృందాల నోడల్ అధికారులు వారికి సంబంధించి అంశాలకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన కోవిడ్ -19 ఆర్డర్ల పై పూర్తిగా అవగాహన పెంచుకుని విధులు నిర్వహించాలన్నారు.

ఇవీ చూడండి...

అలుపెరగని అమరావతి రైతులు... 213వ రోజుకు నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.