ETV Bharat / state

జావెలిన్ త్రో లో ఆశలు రేపుతున్న తెలుగమ్మాయి రష్మి.. - గుంటూరుకు చెందిన జావెలిన్ త్రో క్రీడాకారిణి

Javelin throw player Rashmi: పట్టుదల, ఏకాగ్రతతో ఉంటే ఎలాంటి లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని.. గుంటూరుకు చెందిన జావెలిన్ త్రో ప్లేయర్ రష్మి నిరూపిస్తోంది. పాఠశాల దశలో క్రీడలపై ఆమెకు ఏర్పడిన మక్కువ.. ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో మరింత ముందడుగు వేసేలా చేసేంది. ప్రస్తుతం జాతీయస్థాయిలో సీనియర్ ప్లేయర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ మరింతగా రాణించేందుకు ఆమెకు సరైన ప్రోత్సాహం కరవైంది..

Javelin throw player Rashmi
జావెలిన్ త్రో ప్లేయర్ రష్మి
author img

By

Published : Dec 12, 2022, 10:41 AM IST

Javelin throw player Rashmi: కర్ణాటకలోని పుత్తూరు గ్రామానికి చెందిన రష్మి.. అథ్లెట్ గా అంచెలంచెలుగా ఎదిగారు. 15 ఏళ్ల వయసులో జావెలిన్ చేతబట్టి సత్తా చాటారు. ఇప్పటివరకు జాతీయ, రాష్ట్రస్థాయిలో 20 పతకాలు రష్మి సాధించారు. 2009 కొచ్చిలో సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పతకం ఒడిసిపట్టారు. 2010-11 మధ్యకాలంలో పుణెలో జరిగిన నేషనల్ స్కూల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో బంగారు పతకం, 2012లో నేషనల్ ఇంటర్ జోనల్ అథ్లెటిక్స్ పోటీల్లో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నారు. లక్నోలో జరిగిన 28వ నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పతకంతో మెరిసిన రష్మి.. 2013లో ఇంటర్ యూనివర్సిటీలో అథ్లెటిక్స్ టోర్నమెంటులో కాంస్యం దక్కించుకున్నారు. 2014 నుంచి 2019 వరకు వివిధ జాతీయస్థాయి పోటీల్లో రజత, కాంస్య పతకాలు సంపాదించారు.

మరో అథ్లెట్ దుర్గారావుతో వివాహం తర్వాత ఆంధ్రప్రదేశ్ తరపున ఆడుతోన్న రష్మి.. వచ్చే ఆసియన్ గేమ్స్ లో పతకం సాధించడం తన లక్ష్యమని చెబుతున్నారు. గత 15 ఏళ్లుగా నేను జావెలిన్‌ త్రో ఆడుతున్నాను. ఇప్పటివరకూ 20 పతకాలు సాధించాను. ఏషియన్‌, జాతీయ క్రీడల్లో పతకాలు సాధించడమే నా లక్ష్యం. హరియాణాలో నేను నా సాధన కొనసాగిస్తున్నాను. రాజేంద్రసింగ్‌ నా కోచ్‌. నాకు స్పాన్సర్ కావాలి.

ప్రస్తుతం 55 మీటర్ల వరకు రష్మి జావెలిన్ విసురుతుంది. కనీసం 80 మీటర్ల వరకు జావెలిన్ విసరాలనేది ఆమె లక్ష్యం. ఇలాంటి కీలక సమయంలో మంచి కోచింగ్ సదుపాయం, సరైన ఆహారం అవసరమని ఆమె భర్త దుర్గారావు చెబుతున్నారు. జావెలిన్ త్రోలో అలుపెరుగని పోరాటం చేస్తున్న రష్మికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం, స్పాన్సర్ల నుంచి చేయూత అందితే.. మరిన్ని పతకాలు వస్తాయనడంలో సందేహం లేదు.

ఆంధ్రప్రదేశ్ తరపున ఆడుతోన్న జావెలిన్ త్రో ప్లేయర్ రష్మి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.