కరోనా వ్యాప్తి నివారించేందుకు ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను ప్రజలు స్వచ్ఛందంగా పాటించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నరసారావుపేటలో సైతం ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రాలేదు. నరసారావుపేట పట్టణ వీధుల్లో రోడ్లన్నీ బోసిపోయాయి. పోలీసులు రెండు రోజుల నుంచి కర్ఫ్యూపై అవగాహన కల్పించారు. తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు ఫిరంగిపురంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. పొన్నూరు నియోజకవర్గంలో ఉదయం 7 గంటల నుంచి ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. నిత్యం జనంతో రద్దీగా ఉండే ప్రధాన రహదారులు ఖాళీగా దర్శనమిచ్చాయి.
గుంటూరులో ఇళ్లకే పరిమితమైన ప్రజలు
గుంటూరు జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో జనతా కర్ఫ్యూను ప్రజలు స్వచ్చందంగా పాటించారు. ఉదయం నుంచే బయటికి రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. పోలీసులు జాగ్రత్తలు తెలుపుతూ పలు నియోజకవర్గాల్లో ప్రచారాలు నిర్వహించారు.
కరోనా వ్యాప్తి నివారించేందుకు ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను ప్రజలు స్వచ్ఛందంగా పాటించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నరసారావుపేటలో సైతం ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రాలేదు. నరసారావుపేట పట్టణ వీధుల్లో రోడ్లన్నీ బోసిపోయాయి. పోలీసులు రెండు రోజుల నుంచి కర్ఫ్యూపై అవగాహన కల్పించారు. తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు ఫిరంగిపురంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. పొన్నూరు నియోజకవర్గంలో ఉదయం 7 గంటల నుంచి ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. నిత్యం జనంతో రద్దీగా ఉండే ప్రధాన రహదారులు ఖాళీగా దర్శనమిచ్చాయి.
ఇదీ చదవండి: జనతా కర్ఫ్యూలోనూ అమరావతి రైతుల పోరుబాట