రాజధాని రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని గుంటూరు జిల్లా మంగళగిరిలో నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఓదార్చే హక్కు తమకు ఉందన్న నాగబాబు...రాజధాని రైతుల ఆందోళనకు జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. రాజధాని గ్రామాలకు వెళ్లకూడదని పోలీసులు ఆంక్షలు విధించారని వాపోయారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు లాఠీఛార్జి చేశారని... ఎర్రబాలెం వరకైనా వెళ్లేందుకు అనుమతివ్వట్లేదని తెలిపారు. ఎంత సమయమైనా ఆయా గ్రామాల్లో పర్యటించి రైతులను పరామర్శిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో జనసేన నేతలు అరెస్ట్