విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయకుండా... తమవంతు కృషి చేస్తామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన... ప్రైవేటీకరణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలుస్తారని తెలిపారు.
లక్షమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ప్లాంటును ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో పెట్టడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఈ ఉక్కు పరిశ్రమ కోసం 32 మంది ప్రాణత్యాగం చేశారని, లక్షల మంది ఆందోళనలు చేశారని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. యూపీఏ హయాంలో పెట్టుబడుల ఉపసంహరణలో ఉక్కు కర్మాగారాన్ని చేర్చారని ప్రస్తావించారు.
ఇదీచదవండి.