Janasena Leader Nadendla Manohar Comments: విద్యావ్యవస్థలో మార్పులు చేస్తామని ప్రభుత్వం మభ్యపెట్టి ప్రజలను మోసం చేసిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 'నాడు-నేడు' కార్యక్రమంలో చోటు చేసుకున్న అవినీతిని బయటకు తెస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ కుంభకోణాలను వెలుగులోకి తీసుకువచ్చే కార్యక్రమంలో భాగంగా విద్యావ్యవస్థలో జరుగుతున్న అక్రమాల వివరాలు వెల్లడించినట్లు తెలిపారు.
'మన బడి - నాడు నేడు' పేరుతో భారీ అవినీతి: : రెండో విడతలో 13,860 అదనపు పాఠశాల గదులు నిర్మిస్తామని వైసీపీ ప్రభుత్వం చెప్పిందని, అయితే, ఇప్పటివరకు 612 అదనపు పాఠశాల గదులు పూర్తయ్యాయని నాదెండ్ల పేర్కొన్నారు. కనీసం 10 శాతం నిర్మాణాలు పూర్తి చేయలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం పనులు పూర్తి చేశామని నివేదికలు పంపారని వెల్లడించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి నిధులు మళ్లించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 23,221 పాఠశాలలకు గాను 1,174 స్కూళ్లలోనే సౌకర్యాలు కల్పించారని ఆరోపించారు. స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమం కింద కేంద్రం నిధులు ఇస్తే, చాలా చోట్ల పనులు పూర్తి కాకుండానే, 49,293 మరుగుదొడ్లు పూర్తి చేసినట్టు నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు.
Nadendla Manohar: పని చేయని బటన్లు ఎన్ని నొక్కితే ఏం ప్రయోజనం?
2,253 కోట్లు ఏమయ్యాయో అర్థం కావట్లేదు: స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఒక్కో విద్యార్థి రూ. వెయ్యి చొప్పున వసులు చేశారని ఆరోపించారు. ఆ నిధులు రూ.180 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష అభియాన్ కింద రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు రూ.700 కోట్ల ఎయిడ్ ఇచ్చిందని, కేంద్రం, ఇతర సంస్థల నుంచి రాష్ట్రానికి రూ.6వేల కోట్లు వచ్చినట్లు తెలిపారు. రూ.2,253 కోట్లు ఏమయ్యాయో అర్థం కావట్లేదని నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిలోనే కార్యక్రమాలు పూర్తి చేస్తామని సీఎం ప్రకటించారు. 27 నెలలు పూర్తయినా కార్యక్రమంలో పురోగతి లేదని వెల్లడించారు. ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేసి తప్పించుకునే సీఎం జగన్, ఈ అంశాలపై స్పందించాలని మనోహర్ డిమాండ్ చేశారు.
ఆ విషయంలో అభినందించాల్సిందే - బాలినేనిపై నాదెండ్ల మనోహర్ సెటైర్
జీతాలు ఇవ్వలేని దుస్థితి: రాష్ట్రంలో పని చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ టీచర్లకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని నాదెండ్ల విమర్శించారు. అంగన్వాడీలకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని నాదెండ్ల తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగులు నేటి నుంచి సమ్మె చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అంగన్వాడీలకు మద్దతుగా జనసేన పోరాటం చేస్తుందని నాదెండ్ల హామీ ఇచ్చారు. సమగ్ర శిక్ష అభియాన్ టీచర్లకు జీతాలు పెంచుతామని ఇప్పటివరకూ జీతాలు పెంచలేదని తెలిపారు. సమగ్ర శిక్ష అభియాన్ టీచర్లకు గత నాలుగు నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.
వైసీపీ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయి- టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో వస్తాం: నాదెండ్ల