Janasena Chalo Assembly Against Illegal Sand Mining: రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలను నిరసిస్తూ జనసేన ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వటంపై పోలీసులు ఆంక్షలు విధించారు. జనసేన నేతలు అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు ముందస్తు నోటీసులు అందజేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని నాయకులందరికీ పోలీసులు నోటీసులివ్వటంతో పాటు ముఖ్యమైనవారిని గృహ నిర్భందం చేశారు. మరికొందరిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదే విధంగా సచివాలయం సమీపంలోని మల్కాపురం జంక్షన్ వద్ద ఛలో అసెంబ్లీ ముట్టడికి వచ్చిన జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు, ఇతర జనసేన నేతలను అరెస్టు చేశారు.
అయితే పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా తమ నిరసన తెలియజేస్తామని జనసేన నేతలు చెబుతున్నారు. అడ్డగోలు ఇసుక తవ్వకాలను రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతల అండతో అక్రమ తవ్వకాలు సాగుతున్నందున ఏపీ పోలీసులు, సెబ్ అధికారులు కట్టడి చేయలేకపోతున్నారని వారు విమర్శిస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వ సాయం కోరుతున్నట్లు ప్రకటించారు.
అధికార పార్టీ అక్రమాలు, వైఫల్యాలపై ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి జనసేన పిలుపునివ్వడంతో.. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో జనసేన నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికార పార్టీ తూట్లు పోడిచేలా వ్యవరిస్తుందని జనసేన నేతలు మండిపడుతున్నారు. అక్రమ అరెస్టులు చేసి పోరాటాన్ని ఆపాలని చూస్తున్నారన్నారు. అధికార పార్టీ వికృత చేష్టలను ఖండిస్తున్నామన్నారు. వైసీపీ రాక్షస పాలనకు రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని తెలిపారు. ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టినా ప్రభుత్వ వైఫ్యల్యాలు, దోపిడీలు, అక్రమాలపై పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు.
మండిపడ్డ రాష్ట్ర ప్రభుత్వ ఇసుక పాలసీపై ప్రశ్నించటానికి వెళుతున్న తమని గృహ నిర్భంధం చేయటం దారుణమని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. ఇసుక పాలసీ అక్రమం కాబట్టే ప్రశ్నించడానికి వెళుతున్న తమని అరెస్టు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్ధానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓటమి తథ్యమని అన్నారు. అందుకనే పలు సార్లు సీఎం జగన్మోహన్ రెడ్డి పశ్చిమ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.
Janasena fire on CM Jagan visit to Tirupati: సీఎం జగన్ తిరుపతి పర్యటన సర్కస్‌ను తలపించింది: జనసేన
వైసీపీ కార్యాలయానికి భూమిని కాజేశారు: త్వరలో వాహన మిత్ర కార్యక్రమానికి వస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి స్ధానికంగా ఉన్న ఆటో డ్రైవర్ల కష్టాలు తెలుసుకోవాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కార్యలయం నిర్మాణానికి అక్రమ మార్గంలో.. కార్మిక శాఖకు చెందిన భూమిని కాజేశారని పోతిన మహేష్ ఆరోపించారు. గత ఎన్నికలలో సీఎం ఇచ్చిన హామిలపై శ్వేత పత్రం విడుదల చేసి నియోజకవర్గంలో అడుగు పెట్టాలన్నారు. జగనన్న కాలనీలోని ఇళ్లల్లో ఒక్క ఇల్లు అయినా నిర్మించారా.. టిడ్కో ఇళ్లు పూర్తి చేసి ఒక్కరికైనా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు.
వర్షాకాలంలో నియోజకవర్గంలో సగం ప్రాంతం ముంపుకు గురవుతుందని.. ఇప్పటి వరకు అవుట్ ఫాల్ డ్రెయినేజీ నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో అడుగు పెట్టడం వలన ప్రజలకు ఉపయోగమేమి లేదని అన్నారు. నియోజకవర్గంలోని వైసీపీ నాయకుల అవినీతిపై స్పందించాలన్నారు. హామీలు నిలబెట్టుకోకుండా నియోజకవర్గంలో అడుగుపెడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి జనసేన నిరసన ఎలా ఉంటుందో తెలియజేస్తామని పోతిన మహేష్ హెచ్చరించారు.