ETV Bharat / state

'జగనన్నా మా డబ్బులు ఇప్పించండి'.. వైసీపీ కార్యాలయం ఎదుట జానపాడు గ్రామస్థుల ధర్నా

author img

By

Published : Feb 24, 2023, 8:32 PM IST

Updated : Feb 25, 2023, 6:20 AM IST

Dharna In Front Of YSRCP Central office : డబ్బులు ఎవ్వరికి ఊరికే రావు.. కానీ ఆ నాయకుడికి వచ్చాయి. పిల్లల భవిష్యత్ కోసం రూపాయి రూపాయి పోగు చేసుకున్న పేద ప్రజలు.. ఓ వ్యక్తి మాటలు విని అంతా ముట్టజెప్పారు. ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు... ఎన్నిసార్లు అడిగినా సమాధానమే లేదు. ఎవరితో అడిగిచ్చినా అతనూ వైసీపీకి చెందిన నాయకుడే కావడంతో ప్రయోజనం శూన్యం. ఈ మధ్య డబ్బులు అడిగితే మరింత రెచ్చిపోయి కొడతాను.. చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితులంతా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. జగనన్నా మా డబ్బులు ఇప్పించండి అంటూ మొర పెట్టుకున్నారు.

Etv Bharat
Etv Bharat

Dharna In Front Of YSRCP Central office : అతనో వైఎస్సార్సీపీ నాయకుడు. ప్రజల సేవే తన ధ్యేయం అంటూనే పలువురిని నట్టేట ముంచాడు. ఇతనికి ఓ సైడ్ బిజినెస్ కూడా ఉందండోయ్. అదే రియల్ ఎస్టేట్. పేద ప్రజల కష్టాన్ని, వారి పిల్లల బంగారు భవిష్యత్​ను ప్రశ్నార్ధకంగా మార్చాడు. వారు చెమటోడ్చి, తిని తినకుండా పోగు చేసుకున్న సొమ్మును మాయమాటలు చెప్పి దండుకున్నాడు. తిరిగి ఇవ్వమంటే అధికార దర్పం ప్రదర్శిస్తున్నాడు. ప్రసుత్తం తమ గోడును సీఎం జగన్​కు విన్నవించడానికి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

చంపుతానని బెదిరింపులు : పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామస్థులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జ్ అశోక్​బాబు తమ వద్ద దాదాపు రూ.ఆరు కోట్లకు పైగా డబ్బులు తీసుకొని ఇవ్వడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014 నుంచి 2018 వరకు తమ గ్రామంలో అశోక్ బాబు స్థిరాస్తి వ్యాపారం చేసే సమయంలో డబ్బులు తీసుకున్నారని.. ఇప్పుడు వాటిని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద అన్నీ ఆధారాలున్నాయని చెప్పారు. జానపాడు గ్రామస్థులు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళన చేస్తుండగా.. కార్యాలయ సిబ్బంది వచ్చి వారిని లోపలికి తీసుకెళ్లారు. వారు తీసిన వీడియోలను సైతం డిలీట్ చేయించారు. సాయంత్రం పెద్ద నాయకులు వస్తారని అప్పటి వరకు మౌనంగా ఉండాలని హెచ్చరించారు.

వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఎదుట ధర్నా

"మాకు 15 లక్షల దాకా రావాలి. ఇదిగో ఇస్తా.. అదిగో ఇస్తానని 9, 10 సంవత్సరాల నుంచి తిప్పుతున్నాడు. ఏం జరగలేదు. న్యాయం కోసం జగనన్న దగ్గరకు వచ్చాం. డబ్బులు అడిగితే బెదిరిస్తున్నాడు.. కొడతాం, చంపుతాం అంటున్నాడు. ఎన్నిసార్లు ఎవ్వరి చేత అడిగించినా సమాధానం లేదు... మా డబ్బులు మాకు కావాలి. " - నాగమ్మ, జానపాడు గ్రామస్థురాలు

ఇవీ చదవండి

Last Updated : Feb 25, 2023, 6:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.