ETV Bharat / state

గుంటూరులో జనజాగరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కన్నా

గుంటూరులో జనజాగరణ కార్యక్రమాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. లాక్​డౌన్ సమయంలో ప్రజల కష్టాన్ని చూడలేక ప్రధాని మోదీ.. రెండు సార్లు భారీ ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించి ఆదుకున్నారని ఆయన వెల్లడించారు.

Jana Jagarana program launched in guntur by BJP state president kanna laxminarayana
ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తోన్న కన్నా
author img

By

Published : Jun 15, 2020, 3:36 PM IST

కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలతో భారతదేశం మళ్లీ పుంజుకునేందుకు ఆస్కారం ఏర్పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రధానిగా మోదీ రెండో సారి ప్రమాణం చేసి ఏడాది దాటిన సందర్భంగా చేపట్టిన జన జాగరణ కార్యక్రమాన్ని ఆయన గుంటూరులో ప్రారంభించారు. కేంద్రం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న సమస్యలకు మోదీ పరిష్కరం చూపారని తెలిపారు. లాక్​డౌన్ సమయంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు రెండు సార్లు ఆర్థిక ప్యాకేజి ప్రకటించారని చెప్పారు.

ఇదీచదవండి.: 'ప్రధాని మోదీ అభివృద్ధిపై ఇంటింటి ప్రచారం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.