ETV Bharat / state

'జయహో' పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్​ - jayaho

ప్రజా ప్రస్థానం పేరిట జగన్​ చేసిన పాదయాత్ర విశేషాలతో రచించిన జయహో పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు.

జయహో పుస్తకం ఆవిష్కరించిన జగన్​
author img

By

Published : Aug 12, 2019, 4:03 PM IST

Updated : Aug 12, 2019, 5:06 PM IST

జయహో పుస్తకం ఆవిష్కరించిన జగన్​

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్.. 'జయహో' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రజాప్రస్థానం పేరిట జగన్ చేసిన పాదయాత్ర విశేషాలతో జయహో పుస్తకం రూపొందింది. సీనియర్‌ పాత్రికేయులు రామచంద్రమూర్తి... జయహో పుస్తకాన్ని సంకలనం చేశారు.

3648 కిలో మీటర్లు పాదయాత్ర చేయడమంటే సామాన్యమైన విషయం కాదని... ప్రజల సహకారంతోనే పూర్తి చేయగలిగానని ముఖ్యమంత్రి జగన్​ చెప్పారు. ఏకంగా 14 నెలల పాటు సాగిన ఈ ప్రయాణంలో ప్రతి పేదవాడిని కలిశానని, దాని ఫలితంగానే 50 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు. తన పాదయాత్రపై పుస్తకాన్ని రూపొందించినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి

వాగు ఉప్పొంగింది.. వారికి తాడే తోడైంది!

జయహో పుస్తకం ఆవిష్కరించిన జగన్​

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్.. 'జయహో' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రజాప్రస్థానం పేరిట జగన్ చేసిన పాదయాత్ర విశేషాలతో జయహో పుస్తకం రూపొందింది. సీనియర్‌ పాత్రికేయులు రామచంద్రమూర్తి... జయహో పుస్తకాన్ని సంకలనం చేశారు.

3648 కిలో మీటర్లు పాదయాత్ర చేయడమంటే సామాన్యమైన విషయం కాదని... ప్రజల సహకారంతోనే పూర్తి చేయగలిగానని ముఖ్యమంత్రి జగన్​ చెప్పారు. ఏకంగా 14 నెలల పాటు సాగిన ఈ ప్రయాణంలో ప్రతి పేదవాడిని కలిశానని, దాని ఫలితంగానే 50 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు. తన పాదయాత్రపై పుస్తకాన్ని రూపొందించినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి

వాగు ఉప్పొంగింది.. వారికి తాడే తోడైంది!

Intro:AP_VSP_57_12_DONKARAYI POWER CANAL KU GANDI TO VIDYUT VUTPATTIKU ANTARAYAM_AV_AP10153Body:విశాఖ తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లో సీలేరు కాంప్లెక్స్‌ లో ఉన్న డొంకరాయి జలాశయానికి అర్థరాత్రి సమయంలో గండికొట్టింది.
పక్కనే ఉన్న పోలీసుస్టేషన్‌ సిబ్బంది నీరు ప్రవహిస్తున్న శబ్దాన్ని గమనించిన జెన్‌కో అధికారులకు తెలియజేయడంతో విషయం
బయటకు వచ్చింది. దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సీలేరు కాంప్లెక్స్‌లోని డొంకరాయి జలవిద్యుత్‌కేంద్రంలో
విద్యుదుత్పత్తి అనంతరం విడుదలైన నీరు సుమారు 16 కిలోమీటర్లు పొడవులో ఉన్న పవర్‌ కెనాల్‌ ద్వారా పొల్లూరు జలవిద్యుత్‌
కేంద్రానికి చేరుకుంటుంది. గత పదిరోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువప్రాంతాలు నుంచి వస్తున్న వరద
నీరుతో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం అర్థరాత్రి పవర్‌కెనాల్‌కు పెద్ద ఎత్తున కోతకు గురై భారీ
ఎత్తున గండిపడింది. జలవిద్యుత్కేంద్రానికి అరకిలోమీటరు దూరంలో ఉన్న మొదటి హెడ్‌ రీచ్‌ ఎక్విడేట్‌ మొదటి బాగం వద్ద
పవర్‌కెనాల్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పోలీసుస్టేషన్‌ ముందు నుంచి కాలువ ద్వారా భారీగా నీరు ప్రవహించే శబ్దాన్ని
గమనించిన పోలీసులు జెన్‌కో అధికారులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన అధికారులు పవర్‌కెనాల్‌ వద్ద
పెట్రోలింగ్‌ నిర్వహించగా మొదటి బాగంలో కెనాల్‌కు 20 మీటర్లు వరకూ గండిపడిన విషయం బయటపడింది. దీంతో జెన్‌కో
అధికారులు డొంకరాయి జలవిద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తి నిలిపివేసి కెనాల్‌కు నీరు వెళ్లే గేటును మూసివేశారు. అప్పటికే
గండిపడటంతో పవర్‌కెనాల్‌ నుంచి వస్తున్న నీరు కన్నబ్బాయిక్యాంపులోకి ప్రవేశించింది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
ఈలోగా అధి్కారులు ఇసుక బస్తాలతో గండిని పూడ్చివేసే ప్రయత్నం చేపట్టారు. పవర్‌కెనాల్‌కు నీటిప్రవాహం తగ్గినప్పటికీ, ప్రస్తుతం
వస్తున్న నీటినిల్వలు ఎటు మళ్లించాలో అన్న విషయంపై అధికారులు చర్చలు సాగిస్తున్నారు. జెన్‌కో అధికారులు హుటాహుటిన
సంఘటనాస్థలానికి చేరుకుని గండిని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. పవర్‌ కెనాల్‌ కోతకు గురికావడంతో వీటి మరమ్మతులకు రెండు నెలలు సమయం పట్టే అవకాశముందని జెన్‌కో వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. విషయం తెలిసినవెంటనే జెన్‌కో ఉన్నతాధికారులు డొంకరాయి చేరుకుని పరిస్థతి సమీక్షిస్తున్నారు. పవర్‌కెనాల్‌ గండికొట్టడంతో విద్యుదుత్పత్తికి నీరందక డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్కేంద్రాలు మూతబడ్డాయి. తాత్కలికంగానైనా పొల్లూరు జలవిద్యుత్కేంద్రానికి నీరందించడానికి యుద్దప్రాతిపదికన సన్నహాలు చేస్తున్నారు.
బైట్‌: సీహెచ్‌ రామకోటిలింగేశ్వరరావు, ఎస్‌ఈ, ఏపీ జెన్‌కోConclusion:M RAMANARAO SILERU AP10153
Last Updated : Aug 12, 2019, 5:06 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.