Jagan Government Not Set Up Janata Bazaar: 2021 చివరి కల్లా ప్రతి గ్రామంలో సచివాలయం పక్కనే వైఎస్సార్ జనతా బజార్లను ఏర్పాటు చేయబోతున్నాం. రైతులు పండించే 20 రకాల పంటలతోపాటు కూరగాయలు, గుడ్లు, చేపలు, రొయ్యలు కూడా గ్రామస్థాయిలోకి తీసుకెళ్లే కార్యక్రమం చేయబో తున్నాం. ఏడాది సమయం ఇవ్వండి. పంటల్లో కనీసం 30శాతం స్థానికంగా అమ్మగలిగితే గిట్టుబాటు ధరలు దక్కుతాయంటూ 2020 ఏప్రిల్, మే నెలలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ పలికిన పలుకులివి.
జనతా బజార్ల ఏర్పాటు ద్వారా రైతుల పంట ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తామని అన్నదాతల్లో ఆశలు కల్పించారు. 30శాతం పంటను స్థానికంగా అమ్ముకునేలా తోడ్పాటు అందిస్తామని నమ్మబలికారు. వీటి నిర్వహణకు ఐఏఎస్ అధికారిని నియమిస్తామని గొప్పలు చెప్పారు. కానీ ఆ ఊసే మరిచిపోయారు. కనీసం జనతా బజార్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు కూడా చేయలేదు. ఊరూరా జనతా బజార్లు వెలుస్తాయన్నా ఎక్కడా ఒక్క ఇటుక కూడా వేయలేదు.
'నమ్మించు వంచించు'- సొంత జిల్లా ప్రజలను మోసం చేయడానికి సీఎం జగన్ కొత్త పథకం
జనతా బజార్ల ద్వారా విప్లవాత్మక మార్పు తెస్తున్నామంటూ సీఎం జగన్ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. 2020 ఏప్రిల్ నుంచి ఏ సమీక్ష చేసినా ఏ సమావేశం నిర్వహించినా ఇదే మాట చెప్పేవారు. 2021 ఏడాది చివరి నాటికి అన్నీ అందుబాటులోకి వచ్చేస్తాయన్నారు. ఆయన చెప్పిన గడువు ముగిసి రెండేళ్లయింది. ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క జనతా బజారు కూడా పూర్తి చేయలేదు. కనీసం వాటికి ప్రతిపాదనలు కూడా లేవు. రాష్ట్రంలో ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పక్కన జనతా బజార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం 2020లో నిర్ణయించింది.
విద్యుత్ కనెక్షన్లలో స్మార్ట్‌గా జగన్ దోపిడీ - పనేదైనా కమిషన్ కొట్టేయ్
అంటే కనీసం 15వేలకు పైగా జనతా బజార్లు అందుబాటులోకి రావాలి. వీటికి తోడు మండల కేంద్రాల్లోనూ జనతా బజార్లను ఏర్పాటు చేయాలి. మొత్తంగా 20వేల జనతా బజార్ల ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యం. జనతా బజార్లలో శీతలీకరణ యంత్రాల్నీ పెట్టి పళ్లు, పూలు, పాలు, కూరగాయలు తదితర ఉత్పత్తుల్ని నిల్వ చేసి అమ్మకానికి ఉంచుతామని ప్రభుత్వం తెలిపింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన పంట ఉత్ప త్తుల్ని తీసుకొచ్చేందుకు పికప్ వ్యాన్లనీ ఏర్పాటు చేస్తామని, ప్రతి గ్రామ సచివాలయానికీ ఒక ట్రక్కుని అందుబాటులో ఉంచుతామని చెప్పింది. వీటిలో ఏ ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదు.
ప్రభుత్వమే పంట ఉత్పత్తుల్ని రైతుల నుంచి కొనుగోలు చేసి లాభనష్టాలు లేని రీతిలో అందుబాటులో ఉంచాలనేది జనతా బజార్ల లక్ష్యం. దీనివల్ల మార్కెట్లో పోటీ పెరిగి రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయి. దళారుల దోపిడీ తగ్గుతుంది. ఐతే ఆ దిశగా అడుగులే పడలేదు. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలుకల్పించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ఏపీలో తీసుకొచ్చిన రైతుబజారు వ్యవస్థ అటు రైతులకు, ఇటు వినియోగదారులకు లాభదాయకంగా నిలిచింది. గ్రామాల నుంచి రైతులు తమ పంట ఉత్పత్తుల్ని రైతు బజార్లకు తెచ్చేందుకు ఆర్టీసీ బస్సుల్ని కూడా ఏర్పాటు చేసింది. వైసీపీ సర్కారు వచ్చాక వాటి నిర్వ హణను పట్టించుకోకుండా ఆదాయం కోసం బాదుడుకు తెరతీసింది. జనతా బజార్ అంటూ కొన్నాళ్లు ఊదరగొట్టింది. వాటినైనా అందుబాటులోకి తెచ్చారా అంటే అదీ లేదు.