దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి సైబర్ నేరాలు జరగలేదని ప్రతిపక్షనేత జగన్ అన్నారు. గవర్నర్ను కలిసి ఐటీ గ్రిడ్స్ కంపెనీ డేటా వ్యవహారంపై ఫిర్యాదు చేసి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఐటీ గ్రిడ్స్ సంస్థపై దాడులు జరిగినప్పుడు ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయన్నారు. తెదేపాకు సంబంధించిన సేవామిత్ర యాప్ను ఐటీ గ్రిడ్స్ తయారు చేసిందన్నారు. ప్రజల ఆధార్ వివరాలు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సర్వే పేరుతో గ్రామాలకు వెళ్లి... పద్ధతి ప్రకారం ఓట్లు తొలగించారని ఆరోపించారు.
ఇవీ చదవండి...
మహిళలకు ఎల్ఎల్ఆర్ మేళా
పరిధి దాటితే సహించం'