అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 44 రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు నిరసనకారులకు సంఘీభావం ప్రకటించారు. ఈసందర్భంగా మాట్లాడిన నక్కా ఆనంద్ బాబు...ముఖ్యమంత్రి జగన్ తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రకరకాల సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కియా లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పరిశ్రమలు రాష్ట్రం వదిలి పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.పెట్టుబడుదారులు ఏపీ వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.
జగన్‌లో చలనం లేదు
అమరావతి కోసం 40 మంది ప్రాణాలు త్యాగం చేస్తే జగన్‌లో చలనం లేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. తమ 5 ఏళ్ల పాలనలో కరెంట్ చార్జీలు ఏనాడు పెంచలేదని..జగన్ 7 నెలల్లోనే చార్జీలు పెంచారని మండిపడ్డారు. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును కక్షపూరితంగా సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు.
ఇదీచదవండి