ETV Bharat / state

పాఠశాల అభివృద్ధికి.. పూర్వ విద్యార్థి విరాళం రూ. కోటి! - గుంటూరు

కాకుమానులోని నన్నపనేని జిల్లా పరిషత్​ పాఠశాల స్థాపించి 75 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. అంతకు ముందు రూ.10 లక్షలతో పాఠశాలకు ఆట మైదానం అభివృద్ధి చేశారు. పాఠశాల అభివృద్ధి కోసం రూ.50 లక్షలు విరాళాలు ప్రకటించారు. మరోవైపు.. పాఠశాల పూర్వ విద్యార్థి, పారిశ్రామికవేత్త కారుమంచి ప్రసాద్ బాబు.. కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి.. తనకు అక్షర జ్ఞానాన్ని పంచిన పాఠశాలపై అభిమానాన్ని చాటుకున్నారు.

కాకుమాను నన్నపనేని.. జిల్లా పరిషత్​ పాఠశాల

author img

By

Published : Aug 15, 2021, 8:05 PM IST

కాకుమాను నన్నపనేని.. జిల్లా పరిషత్​ పాఠశాల వజ్రోత్సవం

'కన్నతల్లిని, పుట్టిన ఊరిని మర్చిపోకూడదు' అనే నానుడిని గుంటూరు జిల్లా కాకుమానులోని నన్నపనేని జిల్లా పరిషత్ పాఠశాల పూర్వ విద్యార్థులు పాటిస్తున్నారు. పాఠశాల స్థాపించి 75 సంవత్సరాలు పురస్కరించుకుంది. వజ్రోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలను పూర్వ విద్యార్థులు ప్రారంభించారు. పాఠశాలల వ్యవస్థాపకుడు నన్నపనేని నాగయ్య విగ్రహం, పైలాన్ ఏర్పాటుకు శంకుస్థాపన నిర్వహించారు.

కళావేదిక, మధ్యాహ్న భోజన గదులు ప్రారంభించారు. డైమండ్ జూబ్లీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.10 లక్షలతో పాఠశాల ఆట మైదానం అభివృద్ధిపరిచారు. పాఠశాల అభివృద్ధి నిమిత్తం పూర్వ విద్యార్థులు రూ.50 లక్షలు విరాళాలు ప్రకటించారు. ఇప్పటికే లక్షలాది రూపాయలతో పనులు నిర్వహించారు.

కోటి రూపాయలు ప్రకటించిన పూర్వ విద్యార్థి

జన్మించిన ఊరి కోసం, అక్షర జ్ఞానాన్ని నేర్పిన పాఠశాల కోసం పూర్వ విద్యార్థి, పారిశ్రామికవేత్త కారుమంచి ప్రసాద్ బాబు కోటి రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాలతో పాటు గ్రామం అభివృద్ధికి అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం గ్రామంలో కళాశాల ఏర్పాటు చేసే నిర్ణయం చరిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం కనీసం 20 ఎకరాల స్థలం కావాలని.. తాను 5 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాకుమాను గ్రామం, పాఠశాలను ఉత్తమంగా తీర్చిదిద్దాలని నిర్ణయిచారు.

ఇదీ చదవండి:

'నాడు- నేడు' స్కూళ్లను.. ప్రజలకు అంకితం చేయనున్న సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.