గుంటూరులోని కమ్మజన సేవాసమితి.. కేజేఎస్ఎస్ బాలిక వసతిగృహానికి ఐఎస్వో సర్టిఫికేట్ లభించింది. సాధారణంగా పరిశ్రమలు, ఉత్పత్తులు, సేవలకు ఐఎస్వో గుర్తింపు ఇస్తుండగా.. తాజాగా కేజేఎస్ఎస్ వసతిగృహానికి ఈ ఘనత దక్కింది. గ్రామీణ బాలికలకు విద్యాకల్పనలో భాగంగా నాణ్యమైన భోజన, వసతి సదుపాయాలు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం కల్పన విషయంలో కేజేఎస్ఎస్ బాలికల వసతిగృహానికి గుర్తింపు లభించింది. హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ.. కేజేఎస్ఎస్ వసతిగృహం నాణ్యత ప్రమాణాలు, సిబ్బంది పనితీరు, విద్యార్థుల క్రమశిక్షణ వంటి అంశాలు పరిశీలించిన అనంతరం.. ధ్రువీకరణ పత్రం లభించినట్లు పేర్కొన్నారు.
కేజేఎస్ఎస్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు.. ఐఎస్ఓ 9001: 2015, ఐఎస్ఓ 22000: 2018 సర్టిఫికేట్లను బహుకరించారు. ఈ ధ్రువీకరణ మరింత బాధ్యత పెంచిందని కేజేఎస్ఎస్ బాలికల వసతిగృహం అధ్యక్షుడు సామినేని కోటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి...