ETV Bharat / state

ఎఎన్​యూ యూనివర్సిటీ ఎఫ్ఎసీ వీసీ పై విచారణ కమిటీకి ప్రభుత్వం ఆదేశం

ఎఎన్​యూ యూనివర్సిటీ ఎఫ్ఎసీ వీసీపై విచారణ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలను నిగ్గు తేల్చాలని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర స్పష్టం చేశారు. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

inquiry-on-nagarjuna-university-vice-chancellor-rajashekhar
ఎన్జీ యూనివర్సిటీ ఉపకులపతిపై విచారణ కమిటీకి ప్రభుత్వం ఆదేశం
author img

By

Published : May 31, 2021, 10:25 PM IST

Updated : May 31, 2021, 11:21 PM IST

నాగార్జున విశ్వవిద్యాలయం ఎఫ్ఎసీ ఉపకులపతి పి.రాజశేఖర్​పై మరో సారి విచారణ కమిటీని నియామిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రార్ గా ఉన్నప్పుడు రాజశేఖర్ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ ఆరోపణలు వాస్తవమేనని గత ప్రభుత్వ హయాంలో చక్రపాణి కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో చక్రపాణి కమిటీ నివేదికపై చర్యలు నిలిచిపోయాయి.

ఈ క్రమంలో రాజశేఖర్​కు ఎఫ్ఏసీ వీసీ ఇవ్వడంపై తోటి అధ్యాపకురాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజశేఖర్​పై వచ్చిన అవినీతి ఆరోపణలను నిగ్గు తేల్చాల్సిందింగా ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ఆదేశాలిచ్చారు. విచారణ కమిటీ ఛైర్మన్​గా ఆదికవి నన్నయ యూనివర్సిటీ మాజీ వీసీ కె. నిరుపమ రాణిని నియమించారు. సభ్యులుగా రాయలసీమ యూనివర్సిటీ వీసీ ఆనందరావు, ఉన్నత విద్యాశాఖ మాజీ సంయుక్త కార్యదర్శి జి. కన్నందాస్ నియమించారు. ముగ్గురు సభ్యుల కమిటీ 90 రోజుల వ్యవధిలో విచారణ పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అందించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.

ఇదీచదవండి.

జడ్జి రామకృష్ణను జైల్లోనే హత్య చేసేందుకు కుట్ర : వర్ల రామయ్య

Last Updated : May 31, 2021, 11:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.